Page Loader
ఆస్పత్రి నుండి ఉపాసన డిశ్చార్జ్: ఎవరి పోలికో చెప్పిన రామ్ చరణ్ 
పాపతో మీడియా ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

ఆస్పత్రి నుండి ఉపాసన డిశ్చార్జ్: ఎవరి పోలికో చెప్పిన రామ్ చరణ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 23, 2023
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్, ఉపాసన దంపతులు పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఉపాసన డెలివరీ అయ్యారు. పవిత్ర మంగళవారం రోజున మహాలక్ష్మి పుట్టిందని మెగాస్టార్ చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేసారు. మూడురోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న ఉపాసన, ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఆస్పత్రి నుండి బయటకు వస్తూ, అక్కడే ఉన్న మీడియా, ఫ్యాన్స్ తో ముచ్చటించారు రామ్ చరణ్. తన చేతుల్లో పాపను ఎత్తుకుని మీడియాతో ముచ్చటించారు.

Details

పాపాయికి నాన్న పోలికలు 

పాప పుట్టడం తనకు ఆనందంగా ఉందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. తమకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసారు. అభిమానులు చేసిన ప్రార్థనలు గొప్పవని, తన పాప మీద అందరి ఆశీర్వాదం ఉండాలని రామ్ చరణ్ కోరారు. అలాగే పాపకు ఎవరి పోలికలు వచ్చాయని మీడియా ప్రశ్నించగా, అన్నీ నాన్న పోలికలే అని రామ్ చరణ్ మాట్లాడారు. పాపకు పేరు పెట్టే విషయంలో తాను, ఉపాసన ఒక నిర్ణయానికి వచ్చినట్లు రామ్ చరణ్ తెలియజేసారు. అంతేకాదు 21వ రోజున ఆ పేరేంటో తెలియజేస్తానని రామ్ చరణ్ అన్నారు.