Page Loader
Ram Charan: క్లింకారతో రామ్ చరణ్ ఫాదర్స్ డే పిక్.. అదిరిపోయిందిగా  
Ram Charan: క్లింకారతో రామ్ చరణ్ ఫాదర్స్ డే పిక్.. అదిరిపోయిందిగా

Ram Charan: క్లింకారతో రామ్ చరణ్ ఫాదర్స్ డే పిక్.. అదిరిపోయిందిగా  

వ్రాసిన వారు Stalin
Jun 16, 2024
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎట్టకేలకు మెగా మనవరాలు.. రామ్ చరణ్ ‌- ఉపాసన గారాల కూతురు క్లింకార ఫేస్ ను రివిల్ చేశారు. అప్పుడే బుడి బుడి అడుగులు వేస్తూ సందడి చేస్తోంది క్లింకార. ఇక రామ్ చరణ్.. ఉపాసన పెళ్ళి చేసుకున్న 12 ఏళ్లకు క్లింకార పుట్టింది. అప్పటి వరకూ ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా ఓపికగా తమ లైఫ్ ను సెట్ చేసుకున్నారు చరణ్, ఉపాసన. అనుకున్నటైమ్ కు పిల్లలను ప్లాన్ చేసుకున్నారు జంట. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.

వివరాలు 

క్లింకార ఫోటోను షేర్ చేసిన మెగాపవర్ స్టార్ 

కూతురు క్లింకార అప్పుడే నడిచేస్తోంది. చిన్నారి పాదాలతో బుడి బుడి అడుగులు వేస్తోంది. తల్లీ తండ్రి చేయి పట్టుకుని క్లింకార అడుగులు వేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు మెగాపవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన. అంతే కాదు ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా క్లింకార ఫేస్ ను రివిల్ చేశారు మెగా ఫ్యామిలీ. ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదరు చూస్తున్న తరుణం రానే వచ్చింది