Page Loader
బోయపాటి సినిమాలో 1500 ఫైటర్స్‌తో రామ్ పోతినేని యాక్షన్
బోయపాటి సినిమాలో 1500 ఫైటర్స్‌తో రామ్ పోతినేని యాక్షన్

బోయపాటి సినిమాలో 1500 ఫైటర్స్‌తో రామ్ పోతినేని యాక్షన్

వ్రాసిన వారు Stalin
Apr 20, 2023
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికి తెలిసిందే. తాజాగా రామ్ పోతినేనిని డైరెక్ట్ చేస్తున్న బోయపాటి, ఈ సినిమాలో యాక్షన్‌ను ఓ రేంజ్‌లో ప్లాన్ చేశాడు. పాన్ ఇండియా సినిమా కావడంతో దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఫైట్ మాస్టర్ స్టన్ శివ నేతృత్వంలో జరుగుతోంది. ఏకంగా 1500మంది ఫైటర్లతో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఫిల్మ్ సర్కిల్స్ లో చెబుతున్నారు.

రామ్ 

వర్కింగ్ టైటిల్

బోయపాటి- రామ్ పోతినేని సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. 'బోయపాటి రాపో' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 20న సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాత గత నెలలో ప్రకటించారు. మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించేలా ఈ సినిమాకి ఇదే సరైన తేదీ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. దసరా సెలవులు సినిమాతో కలిసి రానున్నాయి. సినిమా విడుదలకు ఇంకా ఐదు నెలల సమయం ఉండడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారు.