
స్కంద రిలీజ్ డేట్: సలార్ విడుదల తేదీకి వస్తున్న రామ్ పోతినేని
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ పోతినేని, శ్రీలీల హీరో హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స్కంద.
రామ్ పోతినేని కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.
నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల స్కంద సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మూవీ సెప్టెంబర్ 28వ తేదీ నుండి తప్పుకున్నట్లు వార్తలు రావడంతో స్కంద సినిమా బృందం ఆ తేదీని తీసేసుకుంది.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న స్కంద సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్కంద విడుదలపై చిత్రబృందం ట్వీట్
The Massive Energetic Storm coming on Perfect Date❤️🔥#Skanda The Attacker unleashes unlimited MASS in theatres on September 28th🤩💥#SkandaOnSep28 in Telugu, Hindi, Tamil, Malayalam & Kannada!❤️
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 6, 2023
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman… pic.twitter.com/RBrcevSCFt