LOADING...
Ram Pothineni: దర్శకుడిగా రామ్ తొలి ప్రయత్నం.. 'రామ్ 23'లో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి..?
దర్శకుడిగా రామ్ తొలి ప్రయత్నం.. 'రామ్ 23'లో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి..?

Ram Pothineni: దర్శకుడిగా రామ్ తొలి ప్రయత్నం.. 'రామ్ 23'లో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి..?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2026
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా లవ్‌, యాక్షన్ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించే హీరో రామ్ పోతినేని ఇప్పుడు తన కెరీర్‌లోనే కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. తొలిసారిగా స్వయంగా కథను సిద్ధం చేసుకుని దర్శకుడిగా మారుతున్న రామ్.. ఓ ఇంటెన్స్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం పూర్తిగా సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుండటం విశేషం. జూన్ 2026 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. హీరోయిన్ ఎంపికకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది. కథలో హీరోయిన్ పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత 'ఉంది.

వివరాలు

త్వరలో అధికారిక ప్రకటన

కేజీఎఫ్' చాప్టర్ 1, 2 చిత్రాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం శ్రీనిధి శెట్టికి కథను వినిపించగా.. ఈ వైవిధ్యమైన స్క్రిప్ట్ ఆమెకు బాగా నచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రెమ్యునరేషన్‌, కాల్షీట్స్‌కు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని.. త్వరలోనే ఆమె ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. దీనిపై మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ పోతినేని 'వీరా' అనే పవర్‌ఫుల్‌, కాంప్లెక్స్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించనున్నారు. హీరోగా నటిస్తూ ఒకేసారి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టడం రామ్ కెరీర్‌లోనే అతిపెద్ద సవాల్‌గా మారనుంది.

Advertisement