Page Loader
ఏజెంట్ సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్ 
ఏజెంట్ సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్

ఏజెంట్ సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 27, 2023
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏజెంట్ సినిమా నిర్మాతలు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రెండు రోజులైతే సినిమా రిలీజ్ అవుతుందనగా, ఏజెంట్ సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడన్నట్లుగా ఒక వీడియోను రిలీజ్ చేసారు. ఈ వీడియోకు ధృవ వర్సెస్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ వీడియోలో రామ్ చరణ్ ను వెనకాల నుండి చూపిస్తూ, ఏజెంట్ ఎక్కడున్నావ్ అనే రామ్ చరణ్ మాటలను వాయిస్ ఓవర్ లో వినిపించారు. దీంతో ఏజెంట్ సినిమాలో రామ్ చరణ్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు. మరికొందరేమో, ఏజెంట్ సినిమాకు సీక్వెల్ ఉంది కావచ్చని, క్లైమాక్స్ లో రామ్ చరణ్ కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Details

ప్రమోషనల్ వీడియో అంటూ వ్యాఖ్యలు 

ఇంకొందరేమో, ఆ వీడియో, సినిమాలోది కాదని, అక్కినేని అఖిల్ ను రామ్ చరణ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాడని, దానికి సంబంధించిన వీడియో అని అంటున్నారు. మరి ఈ మూడింటిలో ఏది నిజమో తెలియాలంటే మళ్ళీ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ సినిమా, ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సెంటిమెంటుగా నిలిచిన ఏప్రిల్ 28వ తేదీన వస్తున్న ఈ చిత్రం, ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఏకే ఎంటర్ టైన్మెంట్, సరెండర్ 2 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో, సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. హిప్ హాప్ థమిజ సంగీతం అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ధృవ వర్సెస్ ఏజెంట్