Ramayana: 'రామాయణ'కు ఆస్కార్ రావాల్సిందే : సీఎం దేవేంద్ర ఫడ్నవిస్
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా అకాడమీ అవార్డు (ఆస్కార్) అందుకోకపోతే తాను తీవ్ర నిరాశకు గురవుతానని వ్యాఖ్యానించారు. 'ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియం' ముంబైలో ఆగస్టు 6న నిర్మాత నమిత్ మల్హోత్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఫడ్నవిస్, 'రామాయణ' చిత్రాన్ని కొనియాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది దశాబ్దానికి ఒకసారి వచ్చే సినిమా కాదు... సహస్రాబ్దానికి ఒకసారి వచ్చే సినిమా. ఇది నిజమైన 'ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియం'. ఈ చిత్రానికి ఆస్కార్ రాకపోతే నేను తీవ్రంగా నిరాశ చెందుతానని ఆయన అన్నారు.
వివరాలు
ఆధునిక సాంకేతికతతో రామాయణం
రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తూ భారతీయ ఇతిహాసాన్ని యువతరానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారని ఫడ్నవిస్ ఇప్పటికే ప్రశంసించిన విషయం తెలిసిందే.
వివరాలు
విడుదల ఎప్పుడంటే?
నితేశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.
'రామాయణ' పార్ట్-1ను 2026 నవంబర్ 6న, దీపావళికి రెండు రోజుల ముందు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సోనీ పిక్చర్స్ ప్రకటించింది.
పార్ట్-2ను 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
భారీ తారాగణం, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.