Loading...
Ramayana: భారత్‌ కంటే ముందే విదేశాల్లో 'రామాయణం'.. రెండు రోజుల గ్యాప్‌కు కారణమిదే!
భారత్‌ కంటే ముందే విదేశాల్లో 'రామాయణం'.. రెండు రోజుల గ్యాప్‌కు కారణమిదే!

Ramayana: భారత్‌ కంటే ముందే విదేశాల్లో 'రామాయణం'.. రెండు రోజుల గ్యాప్‌కు కారణమిదే!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణం' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారత్‌లో విడుదలకు రెండు రోజుల ముందే విదేశీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి సందర్భంగా భారత్‌లో నవంబర్‌ 8న సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం నవంబర్‌ 6నే 'రామాయణం' విడుదల కానుంది. అసలు రెండు విడుదల తేదీల మధ్య ఈ వ్యత్యాసానికి కారణమేంటో నిర్మాత నమిత్‌ మల్హోత్రా వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో సాధారణంగా సినిమాలను శుక్రవారం విడుదల చేయడం ఆనవాయితీగా ఉందని నమిత్‌ మల్హోత్రా తెలిపారు.

వివరాలు

విదేశాల్లో అదే తేదీన సినిమా..

నవంబర్‌ 6 శుక్రవారం కావడంతో విదేశాల్లో అదే తేదీన సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

భారత్‌లో మాత్రం దీపావళి పండగను దృష్టిలో పెట్టుకుని నవంబర్‌ 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇక 'రామాయణం' సినిమాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కించేందుకు చిత్రబృందం భారీగా కృషి చేస్తోంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభించింది.

ట్రైలర్‌ విడుదలైన ఐదు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వ్యూస్‌ నమోదయ్యాయని నమిత్‌ మల్హోత్రా తెలిపారు.

ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు.

వివరాలు

ప్రేక్షకుల ముందుకు భారతీయ కథ..

లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్‌, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించనున్నారు.

'రామాయణం' సినిమాకు ఆస్కార్‌ రావడమే తమ ప్రధాన లక్ష్యం కాదని నిర్మాత నమిత్‌ మల్హోత్రా స్పష్టం చేశారు.

అయితే ప్రపంచంలోని అత్యుత్తమ సృజనాత్మక ప్రతిభను గుర్తించే అకాడమీ వేదికపై తమ సినిమాకు గుర్తింపు లభిస్తే.. అది భారతదేశానికి ఎంతో గొప్ప క్షణంగా నిలుస్తుందని అన్నారు.

భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది.

అంతర్జాతీయ స్థాయిలో భారతీయ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నట్లు పేర్కొంది.

ADVERTISEMENT