
Rana Daggubati: బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో.. ఈడీ ఆఫీసుకు చేరుకున్న రానా.. వీడియో ఇదిగో!
ఈ వార్తాకథనం ఏంటి
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ల కేసులో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఉదయం ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకోగా,ప్రస్తుతం అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా,ఈ యాప్‌ల ప్రమోషన్‌లకు సంబంధించి అందుకున్న పారితోషికం,కమీషన్‌లు,ఆర్థిక లావాదేవీలపై సమగ్రంగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో విచారణకు హాజరవాలని ఈడీ మొదటిసారి నోటీసులు పంపినప్పటికీ,అప్పటికే నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఆ తేదీన హాజరుకాలేనని రానా అధికారులు తెలియజేశారు.
వివరాలు
సెలబ్రిటీలకు ఈడీ ఇప్పటికే నోటీసులు
అలాగే, కొంత సమయం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈడీ విచారణ తేదీని ఈ రోజుకు మార్చి, రెండోసారి సమన్లు జారీ చేసింది. తాజాగా రానా ఈడీ కార్యాలయానికి హాజరై అధికారుల ఎదుట హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసినట్లు ఆరోపణలపై సెలబ్రిటీలకు ఈడీ ఇప్పటికే నోటీసులు పంపింది. ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలను విచారించగా, ఈ నెల 13న నటి మంచు లక్ష్మి విచారణకు హాజరవనున్నట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఈడీ ఆఫీసుకు చేరుకున్న రానా.. వీడియో ఇదిగో!
#WATCH | Hyderabad, Telangana: Actor Rana Daggubati appears before the ED officials at Hyderabad Zonal ED office in connection with an illegal betting apps case inquiry. pic.twitter.com/ZAXWSRrMNU
— TIMES NOW (@TimesNow) August 11, 2025