Loading...
Ranabaali documentary: 'రణబాలి' డాక్యుమెంటరీ ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌.. ఏం చూపించారంటే?

Ranabaali documentary: 'రణబాలి' డాక్యుమెంటరీ ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌.. ఏం చూపించారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika) జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali)పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడే సింగనమల రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్‌ దేవరకొండ కనిపించనున్నారు. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. దసరా కానుకగా అక్టోబరు 16న 'రణబాలి' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించిన సంగతి తెలిసిందే.

వివరాలు

ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందరణ

తాజాగా ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో తొలి భాగాన్ని విడుదల చేశారు. 'ది ఫెమిన్‌ వుయ్‌ ఫర్గాట్‌' (Ranabaali Truth 1 - The Famine We Forgot) పేరుతో ఈ మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

బ్రిటిష్‌ పాలన సమయంలో ఎదురైన తీవ్ర కరవు పరిస్థితులు, ఆ సమయంలో బ్రిటిష్‌ పాలకులు వ్యవహరించిన తీరుతో పాటు వారి దాష్టీకాల గురించి ఈ డాక్యుమెంటరీలో చిత్రబృందం వివరించింది.

'రణబాలి' కథకు సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేలా ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT