Ranabaali: నాలుగు ఎపిసోడ్లుగా 'రణబాలి' డాక్యుమెంటరీ.. ప్రకటించిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న తాజా పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali). ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన 'ఎందయ్యా సామి' (Endayya Saami) సాంగ్ మంచి టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పాటకు వచ్చిన సానుకూల స్పందనను మరింతగా పెంచేందుకు 'రణబాలి' మేకర్స్ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో ముందుకొచ్చారు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేయనున్నారు.
వివరాలు
నాలుగు ఎపిసోడ్లుగా డాక్యుమెంటరీ సిరీస్
ఈ ప్రమోషనల్ సిరీస్ మొత్తం నాలుగు ఎపిసోడ్లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Rashmika), దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ స్వయంగా పాల్గొననున్నారు.
ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో సినిమా గురించి, అలాగే 'రణబాలి' కథ వెనుక ఉన్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, రాహుల్ సాంకృత్యన్ పంచుకోనున్నారు.
అయితే ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.
వివరాలు
దసరాకు 'రణబాలి' విడుదల
'రణబాలి' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది.
వివాహం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.