NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఓటీటీ: కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన రంగమార్తాండ ఓటీటీలోకి వచ్చేసింది
    తదుపరి వార్తా కథనం
    ఓటీటీ: కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన రంగమార్తాండ ఓటీటీలోకి వచ్చేసింది
    ఓటీటీలోకి వచ్చేసిన రంగమార్తాండ

    ఓటీటీ: కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన రంగమార్తాండ ఓటీటీలోకి వచ్చేసింది

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 07, 2023
    12:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చాలా రోజుల తర్వాత రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కృష్ణవంశీ. నటుడి జీవితంలో జరిగే సంఘటనలను, ఎదుర్కొన్న అనుభవాలను గుండెకి హత్తుకునే విధంగా తెరమీద చూపించాడు కృష్ణవంశీ.

    ఉగాది సందర్భంగా థియేటర్లలో సందడి చేసిన రంగమార్తాండ, ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోయింది. ఈ కారణంగా విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది.

    రంగమార్తాండ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈరోజు నుంచి ఇంట్లోనే చూడవచ్చు. ఈ విషయమై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకపోతే ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది రంగమార్తాండ.

    ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ప్రధాన పాత్రల్లో కనిపించారు.

    రంగమార్తాండ

    ప్రధాన ఆకర్షణగా నిలిచిన బ్రహ్మానందం

    మరాఠీలో విజయమందుకున్న నటసామ్రాట్ అనే చిత్రాన్ని తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేశారు కృష్ణవంశీ.

    రంగమార్తాండ కథ ఏంటంటే:

    రంగస్థలం కళాకారుడిగా ఎన్నో విజయాలు అందుకున్న ప్రకాష్ రాజ్ పాత్ర, తన జీవితంలో జరిగే సంఘటనలు ఎదుర్కోలేక పోతాడు. రంగస్థలం మీద నటించిన నటుడికి నిజ జీవితంలో నటించడం రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు.

    ఆ ఇబ్బందులు తన జీవిత ప్రయాణాన్ని ఎటువైపు తీసుకెళ్లాయనేదే కథ.

    ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇదివరకెప్పుడూ ఏ సినిమాల్లో కనిపించని బ్రహ్మానందం ఇందులో కనిపిస్తారు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ ల మధ్య స్నేహం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

    ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    అమెజాన్‌

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఓటిటి

    ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఓనర్ల తీరుపై హరీష్ శంకర్ ఘాటు వ్యాఖ్యలు హాట్ స్టార్
    దేశం కోసం త్యాగం చేసిన అజ్ఞాత వీరులకు సమర్పణగా సాయిధరమ్ తేజ్ షార్ట్ ఫిలిమ్ తెలుగు సినిమా
    అన్ స్టాపబుల్: ప్రకటించిన తేదీ కంటే ముందుగానే వస్తున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అన్ స్టాపబుల్
    అన్ స్టాపబుల్: 2మిలియన్ల ట్రాఫిక్ అంచనాతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి భారీ బందోబస్త్ అన్ స్టాపబుల్

    అమెజాన్‌

    18,000 పైగా తగ్గింపుతో అమెజాన్ లో ASUS Vivobook 14 ల్యాప్ టాప్
    అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత ఆదాయం
    ఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి ధర
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025