Rashmika Mandhana: షాకింగ్ క్యారెక్టర్‌లో రష్మిక?.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్!
ఈ వార్తాకథనం ఏంటి
వరుస విజయాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి రష్మిక మందన్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచారు. విభిన్న పాత్రల్లో ఒదిగిపోతూ మల్టీటాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న 'కాక్టెయిల్ 2'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో షాహీద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కృతిసనన్, రష్మిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ ఇద్దరి పాత్రల గురించి బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ చిత్రంలో కృతి, రష్మిక స్వలింగ ప్రేమికులుగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉండబోతుందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
Details
త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన
దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి హోమి అడజానియా దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 31న షూటింగ్ పూర్తి చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందని దర్శకుడు పేర్కొన్నాడు. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు. అలాగే షాహిద్ కపూర్ ఈ చిత్రంలో ఇప్పటివరకు చూడని విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 'కాక్‌టెయిల్ 2' చిత్రం 2012లో విడుదలైన 'Cocktail'కు సీక్వెల్‌గా వస్తోంది. ఆ చిత్రంలో దీపికా పదుకొనే, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు సీక్వెల్ రూపంలో రానున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.