రావణాసుర రివ్యూ: రవితేజ థ్రిల్ చేసాడా?
నటీనటులు: రవితేజ, సుశాంత్, మేఘా ఆకాష్, అనూ ఇమ్మాన్యుయేల్, పూజితా పొన్నాడ, దక్షా నగర్కార్, సంపత్ రాజ్, రావ్ రమేష్, జయరాం తదితరులు. దర్శకుడు: సుధీర్ వర్మ నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కథ: ప్రముఖ వ్యాపారవేత్త(సంపత్ రాజ్), ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఈ విషయంలో సాయం కోసం క్రిమినల్ లాయర్ కనక మహాలక్ష్మి(ఫారియా అబ్దుల్లా)ను హారిక(మేఘా ఆకాష్) కలుస్తుంది. కనకమహాలక్ష్మి వద్ద పనిచేసే రవీంద్ర (రవితేజ) హారికపై మనసు పారేసుకుని ఆమెకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాడు. ఆ క్రమంలో ఎన్నో నిజాలు తెలుస్తాయి. హత్యకు, సంపత్ రాజ్ కు సంబంధం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎవరెలా చేసారు?
రవితేజ పాత్ర ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. అప్పటివరకు నవ్వులు పండించిన పాత్ర, సడెన్ గా సరికొత్త మలుపు తీసుకుని నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు. ఈ వేరియేషన్ ని రవితేజ చాలా బాగా కనబరిచాడు. హీరోయిన్లకు పెద్దగా స్కోప్ లేదు. కానీ వారి వారి పాత్రల మేరకు బాగానే ఉన్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ రెండు మూడు సీన్లలో తప్ప మళ్ళీ కనిపించదు. మేఘా ఆకాష్ పాత్ర చెప్పుకోదగినట్టుగా ఉంటుంది. మిగతా వాళ్ళు ఓకే. సుశాంత్ చాలా కొత్తగా కనిపిస్తాడు. పాత్ర పరిధి డీసెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. సంపత్ రాజ్, జయరాం, రావు రమేష్ తమ తమ పాత్రల మేరకు నటించారు.
సినిమాలోని ప్లస్సులు, మైనస్సులు
ప్లస్సులు: ఈ సినిమాకు ముఖ్యమైన బలం రవితేజ. ఆ తర్వాత నేపథ్య సంగీతం అని చెప్పవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ లో నేపథ్య సంగీతం బాగుంది. మైనస్సులు: కథ కొత్తదిగా లేకపోవడం, ముఖ్యంగా కథలో మలుపులు రివీల్ అయ్యాక తర్వాతేం జరుగుతుందో తెలిసిపోవడం. ఇంక పాటలు పెద్ద మైనస్ అయినట్టుగా కనిపించాయి. పాటలు వచ్చినప్పుడలా సినిమాను డిస్టర్బ్ చేస్తున్నాయన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్టాఫ్ మంచి వినోదాన్ని పంచుతుంది. సెకండాఫ్ ని మరింత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే సినిమా ఔట్ పుట్ వేరే లెవెల్లో ఉండేది.