రావణాసుర రన్ టైమ్: సూటిగా సుత్తిలేకుండా చెప్పేందుకు రవితేజ రెడీ
aఏప్రిల్ 7వ తేదీన థియేటర్లలోకి వస్తుంది రావణాసుర చిత్రం. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని "ఏ" సర్టిఫికెట్ అందుకుంది. ఇక తాజాగా రావణాసుర రన్ టైమ్ బయటకు వచ్చింది. రావణాసుర చిత్రాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేందుకు రవితేజ రెడీ అయ్యాడు. ఆ ప్రకారమే, 2గంటల 21నిమిషాల 56సెకండ్ల రన్ టైమ్ తో రావణాసుర సినిమాను కట్ చేసారు. యాక్షన్ అంశాలు ఎక్కువగా ఈ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ రన్ టైమ్ అని అంటున్నారు. రావణాసుర చిత్రంలో నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు రవితేజ.
రవితేజ హ్యాట్రిక్ సాధిస్తాడా?
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్న రవితేజ, ఈసారి రావణాసుర తో హ్యాట్రిక్ అందుకుంటాడా లేదా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ఫారియా అబ్దుల్లా, అనూ ఇమ్మాన్యుయేల్, దక్షా నగార్కర్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. అక్కినేని హీరో సుశాంత్ విలన్ పాత్రలో మెరవబోతున్నాడు. టీజర్, ట్రైలర్ ఆసక్తిగా ఉండడంతో రావణాసుర చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి థియేటర్ల వద్ద ఏం జరుగుతుందో చూడాలి.