Page Loader
Ravi Teja: ఫ్యాన్స్ కు 'మాస్ జాతర' చూపించేందుకు రవితేజ సిద్ధం!
ఫ్యాన్స్ కు 'మాస్ జాతర' చూపించేందుకు రవితేజ సిద్ధం!

Ravi Teja: ఫ్యాన్స్ కు 'మాస్ జాతర' చూపించేందుకు రవితేజ సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2024
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో మాస్ మహారాజ్‌గా గుర్తింపు పొందిన రవితేజ 'మిస్టర్ బచ్చన్' తర్వాత ఆర్‌టి75 వర్కింగ్ టైటిల్‌తో ఓ కొత్త యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీపావళీ సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక అప్‌డేట్‌ ఇస్తూ, టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రవితేజ 75వ చిత్రానికి 'మాస్ జాతర' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో మనదే ఇదంతా అనే ట్యాగ్‌లైన్‌ను కూడా జోడించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో గంట పట్టుకొని ఉన్న రవితేజను చూస్తుంటే, ఈ సినిమాలో మోత మోగిపోవడం ఖాయం అనిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌కు మరోసారి మాస్ ఎంటర్‌టైనర్ మూవీని అందించనున్నట్లు తెలుస్తోంది.

Details

రవితేజకు జోడిగా శ్రీలీల

"సామజవరగమన" వంటి హిట్ సినిమాకు రచయితగా పనిచేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు, గతంలో వీరిద్దరూ 'ధమాకా' మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. దీంతో మరోసారి విజయవంతమైన చిత్రం సాధించే అవకాశం ఉందని చిత్ర బృందం ఆశిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2025 మే 9న సమ్మర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.