Page Loader
Raviteja : పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రవితేజ,కిషోర్ తిరుమల మూవీ 
పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రవితేజ,కిషోర్ తిరుమల మూవీ

Raviteja : పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రవితేజ,కిషోర్ తిరుమల మూవీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న 'మాస్ జాతర' సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇదిలా ఉండగా, రవితేజ తన తదుపరి ప్రాజెక్టును సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో చేయనున్నట్టు గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. తాజాగా ఈ చిత్రం భారీగా లాంచ్ అయ్యింది. రవితేజను ప్రధాన పాత్రలో చూపిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను అందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక ఎస్ఎల్వీ సినిమాస్ (SLV Cinemas)బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు ఘనంగా నిర్వహించారు.

వివరాలు 

త్వరలో నటీనటుల వివరాలు 

రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంకీ, దుబాయ్ శ్రీను, కిక్, కృష్ణ వంటి ఎన్నో చిత్రాల్లో తన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో దర్శకుడు కిషోర్ తిరుమల కూడా ఇదే కోణంలో ఓ కుటుంబ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ఇందులో నటించే నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎస్ఎల్వీ సినిమాస్ చేసిన ట్వీట్