NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రవితేజ రావణాసుర ప్రమోషన్స్ మొదలు: టీజర్ రిలీజ్ ఎప్పుడంటే
    తదుపరి వార్తా కథనం
    రవితేజ రావణాసుర ప్రమోషన్స్ మొదలు: టీజర్ రిలీజ్ ఎప్పుడంటే
    మార్చ్ 6వ తేదీన రిలీజ్ కానున్న రావణాసుర టీజర్

    రవితేజ రావణాసుర ప్రమోషన్స్ మొదలు: టీజర్ రిలీజ్ ఎప్పుడంటే

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 02, 2023
    09:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వరుస హిట్లతో దూసుకుపోతున్న మాస్ మహారాజ రవితేజ, ఈసారి రావణాసుర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

    ఈ నేపథ్యంలో ప్రమోషన్లు మొదలెట్టేసారు. తాజాగా రావణాసుర టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మార్చ్ 6వ తేదిన ఉదయం 10:08గంటలకు రావణాసుర టీజర్ ని రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

    ఈ మేరకు ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో యాక్షన్ లో ఉన్న రవితేజ, ఎవరివైపో తీక్షణంగా చూస్తూ కనిపించారు. రావణాసుర చిత్రం మీద జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

    రవితేజ

    ఇప్పటివరకు రివీల్ చేయని రావణాసుర కథ

    ధమాకా తో వందకోట్లు కొల్లగొట్టి తన కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన రవితేజ, ఆ తర్వాత నెలలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో 200కోట్లు కొల్లగొట్టాడు.

    రెండు కెరీర్ బెస్ట్ వసూళ్ళు అందుకున్న తర్వాత వస్తున్న మూవీ కాబట్టి రావణాసుర మీద అటు చిత్రబృందానికే కాదు ఇటు అభిమానుల్లోనూ మంచి ఆశలు ఉన్నాయి.

    రావణాసుర మూవీ నుండి ఇప్పటివరకు ఒక గ్లింప్స్ రిలీజైంది. ఇందులో సినిమా కథ ఏంటన్నది ఏమీ అర్థం కాలేదు. మరి టీజర్ తోనైనా రావణాసుర కథ అర్థమవుతుందేమో చూడాలి.

    సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రవితేజ హీరోగా వస్తున్న రావణాసుర టీజర్ రిలీజ్ డేట్

    #Ravanasura Teaser on March 6th at 10:08 AM 😎 pic.twitter.com/y1qRdBH3Lc

    — Ravi Teja (@RaviTeja_offl) March 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    తెలుగు సినిమా

    ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ పై తాజా అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్
    ప్యార్ లోనా పాగల్ పాటతో రానున్న రవితేజ రావణాసుర సినిమా
    వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో శ్రీ విష్ణు కొత్త చిత్రం సినిమా
    పవర్ స్టార్ కోసం పాట పూర్తి చేసిన రాక్ స్టార్? పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025