
#RC16: రామ్ చరణ్ సినిమాలో కొత్త వారికి అవకాశం.. ఆడిషన్స్ ఎప్పుడు, ఎక్కడంటే!
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్- 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో #RC16(వర్కింగ్ టైటిల్) మూవీ రానున్న విషయం తెలిసిందే.
అయితే #RC16 మూవీకి సంబంధించి మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఈ మూవీలో కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న నేపథ్యంలో కొత్త నటీనటులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఇందుకోసం ఆడిషన్స్‌ను నిర్వహించనున్నారు. రామ్ చరణ్- బుచ్చిబాబు మూవీ ఉత్తరాంధ్ర విలేజ్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో.. ఆ ప్రాంతం నుంచే కొత్త వారిని తీసుకోనున్నారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 5 నుంచి 17 వరకు విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఆడిషన్స్ నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఔత్సాహికులు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆడిషన్స్ తేదీలను వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ ట్వీట్
#RC16 is coming to Uttarandhra for a talent hunt ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) February 1, 2024
To all the aspiring actors, get ready to be a part of something sensational 💥
Auditions in Vizianagaram, Salur, Srikakulam and Visakhapatnam during the month of February.
Email ID to reach out to in case of any… pic.twitter.com/FBF4K4rFCO