
#RC16: రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్
ఈ వార్తాకథనం ఏంటి
గేమ్ ఛేంజర్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది.
శనివారం మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు.
మూవీకి లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman) స్వరాలు సమకూర్చనున్నట్లు వెల్లడించారు.
ఈరోజు రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఎఆర్ రెహమాన్ భారతదేశంలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈ మూవీకి రెహమాన్ కూడా తోడవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ నిర్మించనున్నారు.
ఈ సినిమాతోనే వెంటక్ సతీష్ చిత్ర నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దర్శకుడు బుచ్చిబాబు ట్వీట్
Extremely glad to have gotten a chance to work with you Sir 🙏🏻
— BuchiBabuSana (@BuchiBabuSana) January 6, 2024
It's a dream moment for me..
Tqq @arrahman sir 🙏🏽❤️🤗@AlwaysRamCharan @aryasukku @vriddhicinemas @MythriOfficial @SukumarWritings pic.twitter.com/WNVhdBrtTL