
RC16: రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC16 ఫస్ట్‌లుక్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్,డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం లో రానున్న సినిమా Rc16.
ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా హీరోకి శుభాకాంక్షలు తెలుపుతూ RC16 టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఇందులో,రామ్ చరణ్ తెల్లటి చొక్కా,తెల్లటి ప్యాంటు,నల్ల గాగుల్స్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
"మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు. కష్టపడి పనిచేసి అభిమానులు గర్వపడేలా మరో అడుగు ముందుకు వెయ్యాలని x లో HBD రామ్ చరణ్`అని పోస్ట్ చేశారు.
RC16
పోస్టర్ లో రామ్ చరణ్ నటించిన ల్యాండ్ మార్క్ సినిమాల పోస్టర్లు
RC16 పోస్టర్ రిలీజ్ చేసిన కొద్ది నిమిషాలకే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోస్టర్ లో రామ్ చరణ్ నటించిన ల్యాండ్ మార్క్ సినిమాల పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.
ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతుంది.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, సుకుమార్ తో రంగస్థలం 2 చెయ్యబోతున్నాడు.
RC16 ని వ్రిద్ది సినిమాస్- సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.
రామ్ చరణ్‌కి సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మైత్రి మేకర్స్ చేసిన ట్వీట్
Wishing our Global Star @AlwaysRamCharan a very Happy Birthday 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2024
Let this year be another feather in your cap setting new benchmarks of hardwork and making fans proud ❤️🔥#HBDRamCharan#RC16 #RamCharanRevolts#JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla… pic.twitter.com/9XWrG3E7di