తెలుగు హీరో నుంచి రూ.25కోట్లు తీసుకోవడంపై స్పందించిన సమంత
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత మైయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మైయోసైటిస్ చికిత్స కోసం సమంత ఓ తెలుగు టాప్ హీరో నుంచి రూ.25కోట్లను అప్పుగా తీసుకున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై తాజాగా సమంత స్పందించింది. తెలుగు టాప్ హీరో నుంచి రూ.25కోట్లను తీసుకున్న వార్తలను సమంత ఖండించింది. చాలా ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని, ఆర్థిక పరంగా తనను తాను చూసుకోగలనని, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమంత రాసుకొచ్చింది. అంతేకాకుండా, ఇలాంటి విషయాలు రాసేటప్పుడు మీడియా బాధ్యతగా ఉండాలని కోరారు. తన వైద్యానికి రూ.25కోట్ల ఖర్చు కాదని సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొంది. అందులో తాను చాలా స్వల్ప మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు చెప్పింది.
చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్న సమంత
తన కెరీర్‌లో సంపాదించిన మొత్తాన్ని తన చికిత్స కోసం ఖర్చు చేయడం లేదని ఈ సందర్భంగా సమంత చెప్పుకొచ్చింది. కాబట్టి తనను తాను చూసుకోగలనని చెప్పింది. మయోసోటిస్‌తో వేలాది మంది బాధపడుతున్నారని, చికిత్స సంబంధించి అందించే సమాచారం పట్ల బాధ్యతుగా ఉండాలని సమంత పేర్కొంది. 2022లో సమంతకు ఆటో-ఇమ్యూన్ కండిషన్, మైయోసిటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె అప్పటి నుంచి చికిత్స తీసుకుంటోంది. తాజాగా ఆమె చికిత్స కోసం సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించింది. విజయ్ దేవరకొండ ఖుషి, వరుణ్ ధావన్‌తో సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్‌ను పూర్తి చేసింది. త్వరలో సమంత తన చికిత్స కోసం అమెరికాకు వెళ్లనుంది.