Raa Raja : 'రా రాజా' విడుదలకు సిద్ధం.. నటీనటుల ముఖాలు కనిపించకుండా హారర్ సినిమా!
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి. శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం 'రా రాజా.
ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో నటీనటుల ముఖాలను చూపించకుండా కథ, కథనాలపై మాత్రమే నడిపించారు.
ఇది సాధారణ సినిమాలకు భిన్నమైన వినూత్న ప్రయోగం. ఇప్పటికే టీజర్, ట్రైలర్లు విడుదల కాగా, తాజాగా చిత్రబృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది.
తమ్మారెడ్డి భరద్వాజ్ విడుదల తేదీ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఆయన మాట్లాడుతూ, రా రాజా' టైటిల్ చూసినప్పుడు ఇది ప్రేమ కథ అనిపించిందని, కానీ సినిమాలో ఒక్క మొహం కూడా కనిపించకుండా హారర్ కథతో వస్తుందని తెలిసి ఆశ్చర్యమేసిందన్నారు.
నటీనటుల ముఖాలు చూపించకుండా సినిమా తీయడం అంటే ఎంతో ధైర్యం కావాలన్నారు.
Details
మార్చి 7న రిలీజ్
డైరెక్టర్ శివ ప్రసాద్ ఈ విభాగంలో గొప్ప ప్రయోగం చేశారు. ఇంతకుముందు స్టీవెన్ స్పీల్‌బర్గ్ రూపొందించిన 'డ్యూయెల్'లోనూ ముఖాలు కనిపించవు.
'రా రాజా' విజయం సాధిస్తే, ఇండస్ట్రీలో కొత్త మార్పు రావొచ్చు. హీరోలు, హీరోయిన్స్, స్టార్లు లేకుండా కూడా కేవలం కథతోనే సినిమాలు చేయవచ్చని ఆలోచన బలపడుతుంది.
మార్చి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని చెప్పారు.
దర్శకుడు బి. శివ ప్రసాద్ మాట్లాడుతూ, మా సినిమా ట్రైలర్‌ను చూసి ప్రశంసించి, విడుదల తేదీ పోస్టర్‌ను లాంచ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్‌కి ధన్యవాదాలు.
ఈ చిత్రంలో కథే ప్రధాన పాత్రగా ఉంటుంది. నటీనటుల ముఖాలను చూపించకుండా సినిమా తీయడం ఓ ప్రత్యేకమైన ప్రయోగం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నానని తెలిపారు.