LOADING...
Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' రీ-రిలీజ్ డేట్ ఖరారు
రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' రీ-రిలీజ్ డేట్ ఖరారు

Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' రీ-రిలీజ్ డేట్ ఖరారు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. 2023 డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించగా, శృతి హాసన్ కథానాయికగా నటించింది. హెంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మించగా,రవి బస్రూర్ సంగీతం అందించారు. ఓటీటీ వేదికలో కూడా సలార్ విశేష స్పందనను అందుకుంది.విడుదలైన ఏడాది పాటు నెట్‌ ఫ్లిక్స్‌లో టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది.

వివరాలు 

మార్చి 21న సలార్

ఇదిలా ఉండగా,ఇప్పుడు ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది.అనేక సూపర్ హిట్ సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. రానున్న మార్చి 21న సలార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రీలీజ్ కానుంది. ఇక, మహాశివరాత్రి కానుకగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రెబల్ సినిమాను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ రూపంలో ప్రదర్శించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో రెబల్ స్టార్ అభిమానులు డబుల్ సెలబ్రేషన్‌కు రెడీ అవుతున్నారు.