LOADING...
Regina: లోకేశ్‌ కనగరాజ్‌ నిర్మాణంలో రెజీనా ప్రధాన పాత్రలో కొత్త చిత్రం?
లోకేశ్‌ కనగరాజ్‌ నిర్మాణంలో రెజీనా ప్రధాన పాత్రలో కొత్త చిత్రం?

Regina: లోకేశ్‌ కనగరాజ్‌ నిర్మాణంలో రెజీనా ప్రధాన పాత్రలో కొత్త చిత్రం?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

'ఖైదీ', 'విక్రమ్‌','కూలీ'వంటి విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్‌ కనగరాజ్‌ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్వరలో 'డీసీ' చిత్రంతో కథానాయకుడిగానూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఆయన.. ఇప్పుడు నిర్మాతగా కూడా మరో కొత్త అడుగు వేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, లోకేశ్‌ కనగరాజ్‌ నిర్మాణంలో ఓ మహిళా ప్రాధాన్య కథతో సినిమా రూపొందుతోంది.

వివరాలు 

ప్రారంభమైన చిత్రీకరణ

ఇందులో కథానాయికగా రెజీనాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి విశాల్‌ వెంకట్‌ దర్శకత్వం వహిస్తున్నారని, ఇప్పటికే చిత్రీకరణ కూడా ప్రారంభమైనట్లు తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, కథాంశం, నటీనటులు, సాంకేతిక బృందం వంటి పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement