LOADING...
Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో సింగిల్‌కు విడుదల తేదీ ఫిక్స్
ఉస్తాద్ భగత్ సింగ్ రెండో సింగిల్‌కు విడుదల తేదీ ఫిక్స్

Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో సింగిల్‌కు విడుదల తేదీ ఫిక్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అభిమానుల్లో రోజురోజుకీ ఉత్సాహం పెరుగుతోంది. హరిష్ శంకర్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 26న ఘనంగా విడుదల కానుందని ఇప్పటికే నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన తొలి పాట 'దేఖ్లేంగే సాలా' అభిమానులను ఆకట్టుకోగా, ఇప్పుడు రెండో సింగిల్ విడుదలకు చిత్రబృందం సిద్ధమైంది. 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పేరుతో రానున్న ఈ పవర్‌ఫుల్ యాంథమ్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Details

సంగీతం సమకూర్చనున్న దేవీ శ్రీ ప్రసాద్

ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. యాక్షన్, భావోద్వేగం, కుటుంబ కథాంశం కలగలిపిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో శ్రీలీల, రాశీ కన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజా పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ఎదుట విస్తారమైన జనసమూహం కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. గతంలో సంచలన విజయాన్ని అందుకున్న 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వస్తుండటం, పైగా సంగీత బాధ్యతలు దేవీ శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) నిర్వహిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement