Jana Nayagan: విజయ్ 'జననాయగన్'కు ఊరట.. U/A సర్టిఫికెట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'జన నాయగన్'కు ఊరట లభించింది. ఈ సినిమా U/A సర్టిఫికెట్ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు ప్రారంభించింది. గత డిసెంబర్‌లో సెన్సార్ బోర్డు కోసం పంపిన 'జన నాయగన్' లో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలు మ్యూట్ చేయాలని సూచించగా, నిర్మాణ సంస్థ ఆ మార్పులు చేసి తిరిగి సబ్మిట్ చేసింది. కానీ బోర్డు నుండి సమాధానం రాలేదని, కేవీఎన్ ప్రొడక్షన్స్ తరఫున అత్యవసర పిటిషన్ మద్రాసు హైకోర్టులో దాఖలైంది.
Details
U/A సర్టిఫికెట్ ఇవ్వాలంటూ తీర్పు
హైకోర్టు విచారణలో, ముందుగా U/A సర్టిఫికేషన్ ఇచ్చి రివ్యూ కమిటీకి పంపే అవసరం ఏంటి అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తక్షణమే U/A సర్టిఫికెట్ ఇవ్వాలంటూ తీర్పు వెలువరించారు. అయితే సెన్సార్ బోర్డు ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేసింది. తర్వాత మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు అత్యవసర విచారణ కోసం రిట్ పిటిషన్ కూడా దాఖలయ్యింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు. హైకోర్టు తీర్పుతో 'జన నాయగన్' విడుదలకు అవరోధాలు తొలగిపోయాయి, దీంతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది.