NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అలనాటి అందాల నటి సీమ డియో కన్నుమూత.. దయనీయంగా చివరి రోజులు 
    తదుపరి వార్తా కథనం
    అలనాటి అందాల నటి సీమ డియో కన్నుమూత.. దయనీయంగా చివరి రోజులు 
    బాలీవుడ్ నటి సీమా డియో కన్నుమూత

    అలనాటి అందాల నటి సీమ డియో కన్నుమూత.. దయనీయంగా చివరి రోజులు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 24, 2023
    03:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత మూడేళ్ళుగా ఆల్జీమర్స్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటి సీమ డియో బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ముంబైలో తన నివాసంలో కన్నుమూశారు.

    81ఏళ్ళ వయసులో అనారోగ్య కారణాల కారణంగా సీమా డియో మరణించారు. సీమా డియో మరణ వార్తను ఆమె కుమారుడు అభినయ్ డియో వెల్లడించారు.

    చివరి రోజుల్లో మతిమరుపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సీమా డియో, ఎలా నడవాలో కూడా మర్చిపోయిందని, ప్రతీ చిన్న విషయాన్ని మర్చిపోయేదని అభినయ్ డియో తెలియజేసాడు.

    కొన్నాళ్లుగా డిమెంటియాతో బాధపడుతున్న సీమా డియో‌కు ఆల్జీమర్స్ వ్యాధి అటాక్ అయ్యిందని, దాని కారణంగా శరీరంలో అవయవాలు ఒక్కొక్కటిగా పాడయ్యాయని అభినయ్ అన్నారు.

    Details

    హిందీ, మరాఠీ సినిమాల్లో నటించిన సీమా డియో 

    సీమా డియో హిందీ, మరాఠీ భాషల్లో కలిపి 80కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన చిత్రాల్లో ఆనంద్, కొరా కాగజ్ చెప్పుకొదగ్గవి.

    సీమా డియో భర్త రమేష్ డియో కూడా హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమలో నటుడిగా పనిచేసారు. 93ఏళ్ళ వయసులో రమేష్ డియో 2022లో చనిపోయారు.

    సీమా డియో దంపతులకు ఇద్దరు కుమారులు అజింక్యా డియో, అభినయ్ డియో ఉన్నారు. అజింక్యా డియో నటుడిగా సంసార్, ఇంద్రజీత్ మొదలగు చిత్రాల్లో నటించాడు. అభినయ్ డియో దర్శకుడిగా మారి ఢిల్లీ బెల్లీ, ఫోర్స్ చిత్రాలను తెరకెక్కించాడు.

    సీమా డియో అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 5గంటలకు ముంబైలోని శివాజీ పార్క్ లో జరగనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్
    సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    బాలీవుడ్

    కేవలం డ్యాన్సులు చేసే హీరోయిన్ కాదని కంగనా రనౌత్ పై ఆర్ మాధవన్ ప్రశంసలు  సినిమా
    హాలీవుడ్ సినిమాల్లో పనిచేసే సత్తా భారతీయులకు ఉందంటున్న ప్రియాంకా చోప్రా  సినిమా
    ఛత్రపతి: బరేలీ కా బజార్ సాంగ్ లో బెల్లంకొండ మాస్ స్టెప్పులు, నుస్రత్ బరూచా ఘాటు హొయలు  సినిమా
    ఛత్రపతి ట్రైలర్: నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్  ట్రైలర్ టాక్

    సినిమా

    గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: మొదటి పాటలో అదిరిపోయిన విశ్వక్ సేన్, నేహాశెట్టి రొమాన్స్  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
    ట్రైలర్ టాక్: యుగాంతం కథలను గుర్తు చేస్తున్న బెదురులంక 2012 ట్రైలర్  తెలుగు సినిమా
    మహేష్ బాబు జిమ్ వర్కౌట్స్: అభిమానులతో అద్భుతమైన కొటేషన్ ని పంచుకున్న సూపర్ స్టార్  మహేష్ బాబు
    అప్పుడు వాళ్ళు తిట్టారు, ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు: వైరల్ అవుతున్న రేణు దేశాయ్ కామెంట్స్  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025