LOADING...
Renu Desai: నెటిజన్ల దూషణలపై రేణూ దేశాయ్ ఆగ్రహం.. ఫేక్ అకౌంట్లకు వార్నింగ్!
నెటిజన్ల దూషణలపై రేణూ దేశాయ్ ఆగ్రహం.. ఫేక్ అకౌంట్లకు వార్నింగ్!

Renu Desai: నెటిజన్ల దూషణలపై రేణూ దేశాయ్ ఆగ్రహం.. ఫేక్ అకౌంట్లకు వార్నింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితం, రాజకీయ అభిప్రాయాలపై వస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ముఖం చూపించే ధైర్యం లేకుండా ఫేక్ అకౌంట్ల ద్వారా దూషిస్తున్న వారిని వెతికి పట్టుకుని బుద్ధి చెబుతానని ఇన్‌స్టాగ్రామ్‌లో హెచ్చరించారు. జనవరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీధి కుక్కల సంరక్షణపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చిన్నారి మరణించిన ఘటనకు సంబంధం లేకపోయినా తన పాత వీడియోనుఎడిట్ చేసి జత చేయడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నా భరణం, నావ్యక్తిగత విషయాల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

Details

సోషల్ మీడియాలో వైరల్

నేను వీధి కుక్కల సంరక్షణ కోసం ఎన్జీవో నడుపుతున్నాను.. మనుషుల కోసం కాదు. నన్ను తిట్టడానికి మీకు ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేశారు. దూషణలు చేస్తున్న వారికి గట్టి హెచ్చరిక జారీ చేస్తూ, "మీరు చేసే పనులు మీ ఇంట్లో అమ్మానాన్నలకు, అక్కాచెల్లెళ్లకు చూపించగలరా? ఇకపై ఇలాంటి పనులు చేసే వారిని గుర్తించి, వారి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రుల ముందే మీ దుర్మార్గాలను ఎండగడతానని రేణూ దేశాయ్ తీవ్రంగా హెచ్చరించారు. ఇతరులను కించపరచడానికి సోషల్ మీడియాను వాడటం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె తీసుకున్న నిర్ణయానికి పలువురు మద్దతు తెలుపుతున్నారు.

Advertisement