LOADING...
Renukaswamy murder case: రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్-పవిత్రా గౌడ బెయిల్ రద్దు, అరెస్టు
రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్-పవిత్రా గౌడ బెయిల్ రద్దు, అరెస్టు

Renukaswamy murder case: రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్-పవిత్రా గౌడ బెయిల్ రద్దు, అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమ అభిమాని రేణుకాస్వామి (33) హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నటుడు దర్శన్, నటి పవిత్రా గౌడకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసులో వీరికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే బెంగళూరు పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేశారు. ముందుగా పవిత్రా గౌడను ఆమె ఇంట్లోనే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, తర్వాత దర్శన్‌ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే దర్శన్ హొసకెరెహళ్లిలోని తన భార్య ఇంటికి వెళ్లి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఎగ్జిట్ గేట్ ద్వారా లోపలికి ప్రవేశించాడని, భార్య, కొడుకుతో కలిసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Details

ప్రధాన నిందితులుగా పవిత్రా గౌడ, నటుడు దర్శన్

ఈ కేసులో చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్యలో పవిత్రా గౌడ, ప్రముఖ నటుడు దర్శన్ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబరులో కర్ణాటక హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, పోలీసులు దాన్ని రద్దు చేయాలని కర్ణాటక పోలీస్‌ డిపార్ట్‌మెంట్ పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, నిందితులను కస్టడీలోకి తీసుకొని త్వరగా విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు. కర్ణాటకలో సంచలనంగా మారిన ఈ కేసులో పవిత్రకు అసభ్య సందేశం పంపడం కారణంగా రేణుకాస్వామి హత్యకేసు చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో దర్శన్, పవిత్రా సహా 15 మందిని అరెస్టు చేశారు. విచారణలో రేణుకాస్వామిపై అత్యంత పాశవికంగా దాడి చేసినట్టు తేలింది.