తదుపరి వార్తా కథనం
Oscars 2025: ఆస్కార్ వేడుక క్యాన్సిల్ కానున్నట్లు వార్తలు.. స్పందించిన ఫిల్మ్ అకాడమీ!
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 15, 2025
11:21 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరాన్ని క్రమంగా కార్చిచ్చు చుట్టుముట్టిన విషయం తెలిసిందే.
దీంతో, ఈ ఏడాది ఆస్కార్ వేడుక రద్దు కావచ్చని వార్తలు బలంగా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఫిల్మ్ అకాడమీ తాజాగా స్పందించింది. మార్చి 2న జరగనున్న ఆస్కార్ వేడుకను క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నారని పలు మీడియాలు పేర్కొన్నాయి.
ఈ విషయంపై అకాడమీ సభ్యుల్లో ఒకరు స్పందిస్తూ, అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆస్కార్ వేడుకల్లో ఎలాంటి మార్పులు ఉండవని క్లారిఫై చేశారు.
మరి, ఏవైనా మార్పులు ఉంటే, వాటిని ఫిల్మ్ అకాడమీనే అధికారికంగా ప్రకటిస్తుందన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆస్కార్ వేడుకల్లో ఎలాంటి మార్పులు ఉండవు
Report That Oscars Are “On Verge of Being Canceled” Are False, Film Academy Sources Say (Exclusive) https://t.co/SbWAFZ3L53
— The Hollywood Reporter (@THR) January 15, 2025