LOADING...
Dacoit Review: రివ్యూ: 'డెకాయిట్' - రొమాన్స్, యాక్షన్‌తో అడివి శేష్ మరోసారి మెప్పించాడా?
రివ్యూ: 'డెకాయిట్' - రొమాన్స్, యాక్షన్‌తో అడివి శేష్ మరోసారి మెప్పించాడా?

Dacoit Review: రివ్యూ: 'డెకాయిట్' - రొమాన్స్, యాక్షన్‌తో అడివి శేష్ మరోసారి మెప్పించాడా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2026
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

డబుల్‌ హ్యాట్రిక్ విజయాలతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న అడవి శేష్... 'మేజర్'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తీసుకొచ్చిన తాజా చిత్రం 'డెకాయిట్'. ఈ సినిమా దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ మంచి అంచనాల మధ్య విడుదలైంది. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా? కథ, కథనం ఎలా ఉంది?

వివరాలు

కథ ఏమిటి?

హరిదాస్‌ (అడివి శేష్‌) ఓ హత్య కేసులో 13 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతుంటాడు. కడప జైలు నుంచి మరొక జైలుకు తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. ఈ పారిపోయే ప్రణాళికలో ఇషాద్ భాయ్‌ (Atul Kulkarni) సహాయం చేస్తాడు. దుబాయ్‌కి పారిపోవాలంటే రూ.60 లక్షలకుపైగా డబ్బు అవసరమవుతుంది. ఈలోపు అతను తనకు అన్యాయం చేసిన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్‌ (Mrunal Thakur)పై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన హరి... ఆమె ఇప్పుడు ఓ ఆరేళ్ల కూతురికి తల్లిగా జీవిస్తున్నట్టు తెలుసుకుంటాడు. ఆమె భర్త భాస్కర్‌ (Vaibhav Reddy) తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటాడు. అతని ప్రాణాలు కాపాడాలంటే రూ.1 కోటి అవసరం.

వివరాలు

ఎలా సాగింది?

ఈ పరిస్థితిని చూసిన హరి... తన అవసరాన్ని ఉపయోగించుకుని ఒక ప్లాన్ వేస్తాడు. ఇక కథలో అసలు మలుపులు ఇక్కడే మొదలవుతాయి. అడివి శేష్ సినిమా అంటే థ్రిల్, వైవిధ్యం అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఈసారి కథ, స్క్రీన్‌ప్లేను తానే రాసుకోవడంతో అంచనాలు మరింత పెరిగాయి. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా... స్క్రీన్‌ప్లేలో కొన్ని మెరుపులతో ఆ లోటును కప్పిపుచ్చారు. ప్రథమార్థం నెమ్మదిగా ప్రారంభమై... హీరో జైలు నుంచి తప్పించుకునే సన్నివేశం తర్వాత వేగం అందుకుంటుంది. ట్రైన్ యాక్సిడెంట్ సీన్, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే "పాలపిట్టరో.. కన్నుకొట్టరో" రీమిక్స్ మంచి విజిల్ మూమెంట్‌గా నిలుస్తాయి. హీరో మళ్లీ హీరోయిన్ జీవితంలోకి రావడంతో అసలు సంఘర్షణ మొదలవుతుంది.

Advertisement

వివరాలు

ఉత్కంఠభరితంగా కథ

ఇద్దరూ కలిసి డబ్బు దోచుకోవాలని నిర్ణయించుకునే దశలో కథ మరింత థ్రిల్లింగ్‌గా మారుతుంది. ఇక ద్వితీయార్థంలో సీఐ స్వామి వాళ్లను వెంబడించడం, హీరో హీరోయిన్‌ను పోలీసులకు అప్పగించాలనుకోవడం వంటి అంశాలతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇక ద్వితీయార్థంలో సీఐ స్వామి వాళ్లను వెంబడించడం, హీరో హీరోయిన్‌ను పోలీసులకు అప్పగించాలనుకోవడం వంటి అంశాలతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. హీరోపై కేసు వెనుక ఉన్న కారణాన్ని బాగా చూపించినప్పటికీ... హీరోయిన్ ఆరోగ్య సమస్య, ఆమె తీసుకునే నిర్ణయాలు కొంచెం సిల్లీగా అనిపిస్తాయి. అయితే ఛేజింగ్ సన్నివేశాలు మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌ను భావోద్వేగంగా తీర్చిదిద్దారు. హీరో చేసే త్యాగం క్లాసిక్ ఫీల్ ఇస్తుంది. అయితే ఆ ముగింపును ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారన్నది కీలకం.

Advertisement

వివరాలు

ఎవరు ఎలా చేశారు?

హరిదాస్ పాత్రలో అడివి శేష్ మాస్ లుక్‌లో మెప్పించాడు. మదనపల్లి యాసలో చెప్పిన డైలాగులు, యాక్షన్ సీన్స్, భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన నటన ఆకట్టుకుంటుంది. మృణాల్ ఠాకూర్ తన పాత్రలో ఒదిగి... కళ్లతోనే భావాలను వ్యక్తం చేసింది. అనురాగ్ కశ్యప్ సీఐ స్వామిగా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. ప్రకాశ్ రాజ్, సునీల్, కామాక్షి భాస్కర్ల, అతుల్ కులకర్ణి తదితరులు తమ పాత్రల పరిధిలో బాగా నటించారు. దర్శకుడు కథలో కొత్తదనం చూపించలేకపోయినా... స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాలు బాగా డిజైన్ చేశారు. భీమ్స్ సంగీతం, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు కూడా మెప్పిస్తాయి.

వివరాలు

బలాలు

అడివి శేష్, మృణాల్ నటన ప్రథమార్థంలోని థ్రిల్ పాటలు, యాక్షన్ సన్నివేశాలు బలహీనతలు కొత్తదనం లేని కథ ద్వితీయార్థంలో కొన్ని బలహీన సన్నివేశాలు చివరి మాట 'డెకాయిట్' పూర్తి కొత్త కథ కాకపోయినా... యాక్షన్, థ్రిల్, భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. మొత్తానికి — 'డెకాయిట్'... యాక్షన్‌తో మనసులు దోచేస్తాడు!

Advertisement