Page Loader
RGV -Vyuham: మార్చి 2న 'వ్యూహం' విడుదల.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్ 
RGV -Vyuham: మార్చి 2న 'వ్యూహం' విడుదల.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్

RGV -Vyuham: మార్చి 2న 'వ్యూహం' విడుదల.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్ 

వ్రాసిన వారు Stalin
Feb 28, 2024
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిన 'వ్యూహం' సినిమా విడుదల తేదీని మళ్లీ మార్చారు. ఈ మూవీ మార్చి 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సాంకేతిక సమస్యల వల్ల మార్చి 1న విడదల చేయనున్నట్లు ఆర్జీవీ చెప్పారు. అయితే ఇప్పుడు ఓ రోజు ఆలస్యంగా మార్చి 2న విడుదల చేయనున్నట్లు స్వయంగా ఆర్జీవీ ట్వీట్ చేశారు. సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ.. పట్టువదలని విక్రమార్కుడిని అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా సెన్సార్ సర్టిఫికెట్‌ని పట్టుకున‍్న ఫొటోను కూడా ట్వీట్‌కు జతచేశారు. 'వ్యూహం' మూవీ రెండు నెలల క్రితమే విడుదల కావాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్జీవీ ట్వీట్