తదుపరి వార్తా కథనం
Kannappa Song : న్యూజిలాండ్ అడవుల్లో రొమాన్స్.. 'కన్నప్ప' లవ్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 10, 2025
05:40 pm
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమాను దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే 'కన్నప్ప' నుంచి రెండు టీజర్లు, శివుడిపై ఓ పాట విడుదల కాగా, తాజాగా ఈ సినిమా నుంచి లవ్ సాంగ్ రిలీజ్ చేశారు.
స్టీఫెన్ దేవస్సి సంగీత దర్శకత్వంలో శ్రీమణి రాసిన ఈ పాటను రేవంత్, సాహితీ ఆలపించారు.
మంచు విష్ణు-ప్రీతీ ముకుందన్ మధ్య రొమాంటిక్ లవ్ సాంగ్‌ను న్యూజిలాండ్ అడవుల్లో చక్కగా చిత్రీకరించారు.
'కన్నప్ప' మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.