ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా ఆర్ఆర్ఆర్ నుండి ఆరుగురు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ఆస్కార్ అవార్డును అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రపంచ మొత్తం చర్చించుకుంది.
అయితే మరో మారు ఆర్ఆర్ఆర్ ఖాతాలో అరుదైన గుర్తింపు లభించింది. ఆస్కార్ అవార్డ్స్ అందించే అకాడమీ జ్యూరీ మెంబర్లుగా ఆర్ఆర్ఆర్ నుండి ఆరుగురు ఎంపికయ్యారు.
హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, నాటు నాటు పాట రచయిత చంద్రబోస్, సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ ఉన్నారు.
మొత్తం 398మంది కొత్త జ్యూరీ మెంబర్లలో ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి ఆరుగురు ఉండటం విశేషం.
Details
కనిపించని రాజమౌళి పేరు
అకాడమీ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లలో ఆర్ఆర్ఆర్ హీరోలు స్థానం దక్కించుకున్నందుకు అభిమానులంతా సంతోషంగా ఉన్నారు.
గ్లోబల్ స్టార్స్ అన్న పదానికి నిదర్శనంగా తమ హీరోలు ఇద్దరూ పాపులారిటీని పెంచుకుంటూ పోతున్నారని సంబరపడుతున్నారు.
ఈ జ్యూరీ మెంబర్స్ లో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా ఉన్నారు. గతేడాది జ్యూరీ మెంబర్స్ గా తమిళ హీరో సూర్యను తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి పేరు మాత్రం కనబడలేదు.
96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం 2024 మార్చ్ 10వ తేదీన జరగనున్నాయి.