Page Loader
మ్యాగజైన్ కవర్ పేజీపై ఆర్ఆర్ఆర్ హీరోలు: జపాన్ లో క్రేజ్ మామూలుగా లేదుగా 
యాన్ యాన్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద ఆర్ఆర్ఆర్ హీరోలు

మ్యాగజైన్ కవర్ పేజీపై ఆర్ఆర్ఆర్ హీరోలు: జపాన్ లో క్రేజ్ మామూలుగా లేదుగా 

వ్రాసిన వారు Sriram Pranateja
May 18, 2023
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. భారతీయ సినిమాలకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన ఆస్కార్ ని సైతం ఒడిసి పట్టుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో హీరో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ వచ్చింది. జపాన్ లో అయితే అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. జపాన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రెండు బిలియన్ల యెన్స్ వసూళ్లను సాధించింది ఆర్ఆర్ఆర్ చిత్రం. తాజాగా జపాన్ లో ఆర్ఆర్ హీరోలకు అరుదైన గౌరవం లభించింది. జపాన్ లోని ఫేమస్ మ్యాగజైన్ యాన్ యాన్ కవర్ పేజీ మీద ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తళుక్కున మెరిసారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆర్ఆర్ఆర్ టీం తెలియజేసింది.

Details

తెలుగు సినిమాలకు మరో మంచి మార్కెట్ గా నిలవబోతున్న జపాన్ 

జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇప్పటికీ విపరీతమైన ఆదరణ దక్కుతోంది. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి మంచి వసూళ్ళను జపాన్ లో సాధిస్తోంది ఆర్ఆర్ఆర్ మూవీ. ఇటు రామ్ చరణ్, అటు ఎన్టీఆర్ లకు కూడా అభిమానులు చాలామంది ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైనపుడు, ఆర్ఆర్ఆర్ హీరోలు జపాన్ అభిమానులను కలిసారు. జపాన్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ముందు ముందు జపాన్ కూడా మరో మంచి మార్కెట్ గా నిలవబోతుదని చెప్పడానికి పైవన్నీ ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యాన్ యాన్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద ఆర్ఆర్ఆర్ హీరోలు