LOADING...
 Sivakarthikeyan : రూ. 300 కోట్ల క్లబ్‌లో 'అమరన్'.. శివకార్తికేయన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు! 
రూ. 300 కోట్ల క్లబ్‌లో 'అమరన్'.. శివకార్తికేయన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు!

 Sivakarthikeyan : రూ. 300 కోట్ల క్లబ్‌లో 'అమరన్'.. శివకార్తికేయన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 19, 2024
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

శివ కార్తికేయన్ తాజా చిత్రం 'అమరన్' భారీ విజయాన్ని సాధించింది. తమిళనాడుకు చెందిన ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అక్టోబర్ 31న విడుదలైంది. 'అమరన్' బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుని, మూడ్రోజులోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కును దాటింది. తెలుగురాష్ట్రాల్లో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లు రాబట్టింది.

Details

శివ కార్తికేయన్ నటనకు ప్రేక్షకులు ఫిదా

కేరళ, కన్నడ భాషల్లోనూ శివకార్తికేయన్ కెరీర్ బెస్ట్ వసూళ్లను సాధించి దీపావళి విడుదలైన చిత్రాలలో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. శివకార్తికేయన్ నటనకు, సాయి పల్లవి అభినయానికి ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. కొన్ని కీలక సన్నివేశాలలో సాయి పల్లవి భావోద్వేగ ప్రదర్శన ఆడియన్స్‌ను కంటతడి పెట్టించింది. వీరి నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్నా, 'అమరన్' డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం శివకార్తికేయన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.