LOADING...
Huma Qureshi: హ్యూమా ఖురేషి మ్యారేజ్‌పై గుసగుసలు.. అక్టోబర్‌లోనే ముహూర్తం ఫిక్స్?
హ్యూమా ఖురేషి మ్యారేజ్‌పై గుసగుసలు.. అక్టోబర్‌లోనే ముహూర్తం ఫిక్స్?

Huma Qureshi: హ్యూమా ఖురేషి మ్యారేజ్‌పై గుసగుసలు.. అక్టోబర్‌లోనే ముహూర్తం ఫిక్స్?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2026
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. వరుసగా పలువురు హీరోలు, హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగుపెడుతుండగా, ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఈ జాబితాలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి హ్యూమా ఖురేషి త్వరలో పెళ్లి చేసుకోనుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన హ్యూమా, తొలి చిత్రంతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా మహారాణి వెబ్ సిరీస్ ద్వారా ఆమెకు భారీ స్థాయిలో స్టార్‌డమ్ వచ్చింది. ఇందులో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

వివరాలు

రచిత్ సింగ్తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు

లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటిస్తూ, తన ప్రత్యేకమైన నటనతో ఇండస్ట్రీలో తన స్థానం నిలబెట్టుకుంటోంది. హ్యూమా ఖురేషి కొంతకాలంగా బాలీవుడ్ నటుడు రచిత్ సింగ్తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి రిలేషన్‌షిప్ బాలీవుడ్‌లో ఓపెన్ సీక్రెట్‌గా మారిందనే చెప్పాలి. ఇద్దరూ కలిసి పలు ఈవెంట్లు, పార్టీల్లో కనిపించడం, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు అభిమానాన్ని వ్యక్తం చేయడం వలన వారి ప్రేమపై స్పష్టత వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఒక స్నేహితుడి పెళ్లి వేడుకలో ఈ ఇద్దరూ తొలిసారి కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పరిచయం స్నేహంగా మారి, తరువాత ప్రేమగా మారింది. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు తమ బంధాన్ని వివాహంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

వివరాలు

అధికారిక ప్రకటన వెలువడలేదు

బాలీవుడ్ వర్గాల ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్‌లో హ్యూమా ఖురేషి - రచిత్ సింగ్ వివాహం జరగనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహిస్తారా? లేక ప్రస్తుతం ట్రెండ్‌గా మారిన డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ఎంచుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ పెళ్లి వార్తలపై హ్యూమా ఖురేషి లేదా రచిత్ సింగ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతుండగా, అభిమానులు ముందుగానే ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వార్తలు నిజమైతే, బాలీవుడ్‌లో త్వరలోనే మరో గ్రాండ్ వెడ్డింగ్ చూడవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement