Loading...
NBK112: ఆగిపోయిందంటూ పుకార్లు.. బాలయ్య-కొరటాల మూవీపై టీమ్‌ కీలక ప్రకటన
ఆగిపోయిందంటూ పుకార్లు.. బాలయ్య-కొరటాల మూవీపై టీమ్‌ కీలక ప్రకటన

NBK112: ఆగిపోయిందంటూ పుకార్లు.. బాలయ్య-కొరటాల మూవీపై టీమ్‌ కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2026
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌, నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK112. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు, ఊహాగానాలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా బడ్జెట్‌ కారణాలతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరగడంతో నందమూరి అభిమానుల్లో కొంత అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో NBK112పై వస్తున్న రూమర్లకు చిత్రబృందం అధికారికంగా చెక్‌ పెట్టింది. "Team NBKKoratalaSiva" పేరుతో ప్రకటన విడుదల చేసిన యూనిట్‌.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య వార్తలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేసింది.

వివరాలు

ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ కచ్చితంగా సెట్స్‌పైకి వెళ్తుందని చిత్రబృందం వెల్లడించింది.

ప్రస్తుతం బాలయ్య దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'NBK111'చిత్రంలో నటిస్తున్నారు.

ఆ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే కొరటాల శివతో చేయనున్న NBK112షూటింగ్‌ ప్రారంభమవుతుందని యూనిట్‌ స్పష్టం చేసింది.

ఇటీవల గోపీచంద్‌ మలినేని సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడ్డారు. ఈ క్రమంలో ఆయన మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం బాలయ్య విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నారు.

మరోవైపు బాలకృష్ణ తిరిగి షూటింగ్స్‌లోకి అడుగుపెట్టిన వెంటనే ఎలాంటి విరామం లేకుండా NBK112 చిత్రీకరణను వేగంగా కొనసాగించేందుకు కొరటాల శివ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్‌ పనులను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT