LOADING...
Sai Durgha Tej: 'క' దర్శకులతో సాయిదుర్గాతేజ్‌ కాంబినేషన్‌ ఫిక్స్
'క' దర్శకులతో సాయిదుర్గాతేజ్‌ కాంబినేషన్‌ ఫిక్స్

Sai Durgha Tej: 'క' దర్శకులతో సాయిదుర్గాతేజ్‌ కాంబినేషన్‌ ఫిక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

గత రెండేళ్లుగా కథానాయకుడు సాయిదుర్గాతేజ్‌ పూర్తిగా 'సంబరాల ఏటిగట్టు' సినిమాపైనే దృష్టి పెట్టారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సాయిదుర్గాతేజ్‌ తన తదుపరి సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇటీవల 'క' సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శక ద్వయం సుజిత్‌, సందీప్‌ వినిపించిన కథకు సాయిదుర్గాతేజ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ఉగాది పండుగ రోజున అధికారికంగా ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాక, 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాతో విజయాన్ని అందుకున్న షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ ఈ సినిమాను నిర్మించనుందని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement