Sai Pallavi: కాబోయే భర్త గురించి సాయి పల్లవి కండీషన్స్
ఈ వార్తాకథనం ఏంటి
నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి.. జీవిత భాగస్వామి విషయంలోనూ తన ఆలోచనలు స్పష్టంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందం, ఆస్తి, హోదా కంటే ఎదుటివారి వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ఆమె మాటలు చెబుతున్నాయి. తనకు కాబోయే వ్యక్తి మంచి మనసున్నవాడై ఉండాలని, తన గురించి మాత్రమే ఆలోచించకుండా ఇతరుల భావాలను కూడా అర్థం చేసుకోవాలని సాయిపల్లవి వెల్లడించారు. జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Details
తప్పులను అంగీకరించే పరిణతి ఉండాలి
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమంలో సాయిపల్లవి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
'రామాయణ' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రణ్‌బీర్ కపూర్, రవి దూబేతో కలిసి ఆమె ఈ షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమితాబ్.. జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారని అడిగారు.
దానికి స్పందించిన సాయిపల్లవి.. తన ప్రవర్తనను తాను విశ్లేషించుకోగలిగే వ్యక్తి కావాలని చెప్పారు. ఎక్కడ తప్పు చేశామో గుర్తించి, దాన్ని సరిదిద్దుకునే మనస్తత్వం ఉండాలని వివరించారు.
Details
ఇతరులను నిందించకూడదు.. వంట చేయడం వస్తే ఇంకా మంచిది!
తప్పులు చేయడం సహజమని, అయితే వాటిని అంగీకరించి మార్చుకునే ప్రయత్నం చేయడమే ముఖ్యమని సాయిపల్లవి అభిప్రాయపడ్డారు.
జీవితంలో తాను ఎక్కడ ఉన్నానో అర్థం చేసుకునే పరిణతి ఉండాలని, తన తప్పులకు ఇతరులను బాధ్యులను చేయకూడదని పేర్కొన్నారు.
తన కోరికలు మరీ పెద్దవి ఏమీ కావని చెబుతూ.. మంచి మనిషి అయి ఉండటమే తనకు ప్రధానమని స్పష్టం చేశారు.
అంతేకాదు, కాబోయే భాగస్వామికి వంట చేయడం కూడా తెలిస్తే మరింత బాగుంటుందని సరదాగా చెప్పారు.
ఆమె మాటల్లోని సరళత, వ్యక్తిత్వానికి ఇచ్చిన ప్రాధాన్యం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Details
'రామాయణ'లో సీతగా అలరించనున్న సాయిపల్లవి
ఇక సినిమాల విషయానికొస్తే.. సాయిపల్లవి ప్రస్తుతం నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ'లో సీత పాత్ర పోషిస్తున్నారు.
రణ్ బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. నవంబర్ 5న దిపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మొదటిభాగం విడుదల కాబోతున్నది.
అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటికే ఈ సినిమా రికార్డు దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
సీత పాత్రలో సాయిపల్లవిని చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.