అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సాయి పల్లవి; తల్లిదండ్రులపై ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి దక్షిణాదిన తనకంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. ఇటీవలే తన తల్లిదండ్రులతో కలిసి అమర్‌నాథ్ యాత్రను పూర్తి చేశారు.
అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం షేర్ చేసింది.
ఈ సందర్భంగా తన ప్రయాణ అనుభవాన్ని కూడా సాయి పల్లవి రాశారు. తన తల్లిదండ్రులతో అమర్‌నాథ్ యాత్రకు వెళ్లడం మానసికంగా సవాలుగా మారిందని చెప్పారు.
తన 60 ఏళ్ల తల్లిదండ్రులతో కలిసి ఈ ప్రయాణం చేయడం ఎమోషనల్ ఛాలెంజ్ సాయి పల్లవి ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
సాయి పల్లవి
అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు ధన్యవాదాలు: సాయి పల్లవి
అమర్‌నాథ్ యాత్రలో కొన్నిసార్లు తన తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటం, మంచుపై జారీ పోవడం చూసినప్పుడు 'దేవుడా ఇంత దూరం ఎందుకున్నావ్' ప్రశ్నించినట్లు సాయి పల్లవి పేర్కొన్నారు.
అయితే తిరుగు ప్రయాణంలో తాను కొన్ని దృశ్యాలను చూసి చలించిపోనట్లు సాయి పల్లవి చెప్పారు.
మంచులో యాత్రను కొనసాగించలేక ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వారిని ప్రోత్సహించేందుకు తోటి యాత్రికులు 'ఓం నమః శివాయ' అంటూ నామ స్మరణ చేసి వారిలో శక్తిని నింపే ప్రయత్నాన్ని తాను చూసినట్లు చెప్పుకొచ్చారు.
తమ లాంటి కోట్లాది మంది భక్తులకు సహకరిస్తున్న అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు సభ్యులందరికీ ఈ సందర్భంగా సాయిపల్లవి కృతజ్ఞతలు తెలిపారు.