Saif Ali Khan: సైఫ్‌పై దాడి కేసు.. నిందితుడిపై 5 రోజుల పోలీస్ కస్టడీ
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను బాంద్రాలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
న్యాయస్థానం అతడికి 5 రోజులపాటు పోలీసుల కస్టడీలో ఉంచేందుకు అనుమతించింది. దీంతో అతడిని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిందితుడి తరఫున న్యాయవాదులు మాట్లాడుతూ, పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయలేదని ఆరోపించారు.
5 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించడంతో నివేదికను 5 రోజుల్లో అందించాలంటూ ఆదేశాలిచ్చారని, మహ్మద్ షరీఫుల్ బంగ్లాదేశీయుడు అనడంపై పోలీసుల వద్ద ఆధారాలు లేవన్నారు.
Details
పోలీసులు మాటల్లో నిజం లేదు
అతడు 6 నెలల క్రితమే ముంబయికి వచ్చాడని వారు చెబుతున్నారని, కానీ అది సత్యం కాదన్నారు.
అతడు దాదాపు 7 సంవత్సరాల క్రితం ముంబయికి వచ్చాడని, అతడి కుటుంబం ముంబయిలోనే నివసిస్తోందని కోర్టుకు తెలిపామని వారు పేర్కొన్నారు.
జనవరి 16న తెల్లవారుజామున 2.30 గంటలకు సైఫ్ అలి ఖాన్ నివాసంలో ఈ ఘటన జరిగింది.
సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో నిందితుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు.
జేహ్ కేర్‌టేకర్ కేకలు వేయడంతో సైఫ్ అక్కడికి చేరుకున్నాడు.
Details
దొంగతనం చేయాలనే ఉద్ధేశంతోనే సైఫ్ నివాసంలోకి వెళ్లాడు
ఈ క్రమంలో పెనుగులాట జరిగి, సైఫ్ గాయపడ్డారు. అతడికి కత్తి గాయాలు కావడంతో కేసు నమోదయ్యింది.
శనివారం నిందితుడు ఠానే నుంచి అరెస్ట్ చేశారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో నిందితుడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడని పోలీసులు తెలిపారు. అతడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి, కస్టడీ కోరతామన్నారు.
ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశీయుడిగా గుర్తించామని, అతడు అక్రమంగా భారత్‌లో ప్రవేశించారని చెప్పారు.
భారతీయుడిగా పాసపోర్టు పొందేందుకు విజయ్ దాస్ అనే పేరు మార్చుకున్నారని పోలీసులు వెల్లడించారు.