NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సైంధవ్: వెంకటేష్ కోసం వస్తున్న తమిళ హీరో?
    తదుపరి వార్తా కథనం
    సైంధవ్: వెంకటేష్ కోసం వస్తున్న తమిళ హీరో?
    సైంధవ్ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ తీసుకొచ్చే పనిలో చిత్రబృందం

    సైంధవ్: వెంకటేష్ కోసం వస్తున్న తమిళ హీరో?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 20, 2023
    11:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్ చిత్రాలతో విజయాలు సొంతం చేసుకున్న దర్శకుడు శైలేష్ కొలను, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ సినిమాను మొదలుపెట్టాడు. ఈ చిత్ర గ్లింప్స్ ఆల్రెడీ విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

    సైంధవ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాడు వెంకటేష్. తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకు వచ్చింది. సైంధవ్ చిత్రంలో వెంకటేష్ తో పాటు మరో ఇద్దరు కీలక పాత్రలు పోషించనున్నారని తెలుస్తోంది.

    తమిళ హీరో ఆర్య, సైంధవ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట. ఆ పాత్ర చాలా శక్తివంతంగా ఉండనుందని, సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.

    వెంకటేష్

    తమిళం నుండి ఆర్య, బాలీవుడ్ నుండి నవాజుద్దీన్ సిద్ధిఖీ

    తమిళం నుంచి ఆర్యన్ తీసుకుంటే అటు బాలీవుడ్ నుంచి నవాజుద్దీన్ సిద్ధిఖీని మరో పాత్ర కోసం అప్రోచ్ అయ్యారట. ఆ పాత్ర కూడా సినిమాలో కీలకంగా ఉంటుందని అంటున్నారు.

    అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. కాకపోతే బయటకు వస్తున్న పుకార్లు జనాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

    పాన్ ఇండియాలో సినిమాకు మరింత మార్కెట్ తీసుకురావడానికి వివిధ భాషల నుండి నటీనటులను ఎంచుకుంటున్నారని వినిపిస్తోంది. మరి ఈ విషయం మీద చిత్ర నిర్మాతలు, దర్శకుడు అధికారిగా సమాచారం ఎప్పుడు ఇస్తారో చూడాలి.

    నీహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న సైంధవ్ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తుండగా హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    తెలుగు సినిమా

    గీత గోవిందం కాంబోతో బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ
    కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కోసం మెగా హీరో సినిమా
    ప్రభాస్ సలార్ నుండి సాలిడ్ అప్డేట్ సినిమా
    మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025