Netfilx: ఇంగ్లీష్‌లో అందుబాటులోకి వచ్చిన ప్రభాస్ సలార్
పాన్-ఇండియన్ సంచలనం ప్రభాస్,కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలసి యాక్షన్-ప్యాక్డ్ సినిమా, సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి సక్సెస్ టాక్ తో మంచి సక్సెస్ సొంతం చేసుకుంది ఈ సినిమా. కాగా ఈ పాన్ ఇండియన్ మూవీ థియేటర్ రిలీజ్ అనంతరం OTT లో విడుదలై తన విజయపరంపరను కొనసాగిస్తోంది. జనవరి 20న నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా పలు భాషలలో రిలీజ్ అయ్యింది.
సలార్ మూవీ ఇంగ్లీష్ వర్షన్ ఏ ఓటిటిలో అంటే..
ఇక లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, తాజాగా సలార్ మూవీ ఇంగ్లీష్ వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు నెట్ ఫ్లిక్స్ వారు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, బాబీ సింహా, శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్‌లు ఈ సినిమాలో కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది.. హోంబలే ఫిలింస్ ఈ సినిమాని నిర్మించింది. రవి బస్రూర్ ఈ సినిమాకి డైరెక్టర్.