
సలార్ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లోకి రావట్లేదా? చిత్ర నిర్మాణ సంస్థ ఏమన్నదంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. సలార్ మీద సినిమా ఆసక్తి ఎక్కువగా ఉండటమే ఇలాంటి వార్తలకు మూలం.
గతకొన్ని రోజులుగా సలార్ సినిమా, అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశం కనిపించట్లేదని, ఖచ్చితంగా సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో చిత్రబృందం స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లు, సలార్ సినిమా వాయిదా పడటం లేదని, ఆల్రెడీ ప్రకటించిన సెప్టెంబర్ 28వ తేదీన సలార్ ను విడుదల చేస్తామని కూడా ప్రకటించింది.
అంతేకాదు, సలార్ సినిమా బాగా వస్తోందని, ప్రేక్షకులకు చూపించడానికి ఉత్సాహంగా ఉన్నామని తెలియజేసింది.
Details
చివరి దశకు వచ్చేసిన చిత్రీకరణ
ప్రస్తుతానికి సలార్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసిందని టాక్. కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, పాటలు తప్పిస్తే దాదాపు చిత్రీకరణ పూర్తయ్యిందని సమచారం.
ఇదివరకు సలార్ సినిమా నుండి పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ లుక్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమాలో జర్నలిస్టుగా శృతి హాసన్ కనిపించనుంది. జగపతి బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
అదలా ఉంచితే, ప్రస్తుతం ప్రభాస్ నుండి జూన్ 16వ తేదీన ఆదిపురుష్ రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ రిలీజైన ఆదిపురుష్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
ఆదిపురుష్ తర్వాత రాజా డీలక్స్, ప్రాజెక్ట్ కె పనుల్లో బిజీగా ఉన్నాడు ప్రభాస్.