LOADING...
Dil Raju: సల్మాన్ ఖాన్, దిల్ రాజు కలయికలో భారీ సినిమా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చేతిలోకి ఈ ప్రాజెక్టు
సల్మాన్ ఖాన్, దిల్ రాజు కలయికలో భారీ సినిమా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చేతిలోకి ఈ ప్రాజెక్టు

Dil Raju: సల్మాన్ ఖాన్, దిల్ రాజు కలయికలో భారీ సినిమా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చేతిలోకి ఈ ప్రాజెక్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2025
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరిగా గుర్తింపు పొందిన దిల్ రాజు ఇప్పుడు తన దృష్టిని బాలీవుడ్ వైపు మళ్లించాడని తెలుస్తోంది. వరుస పరాజయాల తర్వాత, ఆయన ఒక భారీ ప్రాజెక్ట్‌తో తిరిగి బరిలోకి దూసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే, బాలీవుడ్ లోని కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మించనున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే, వంశీ పైడిపల్లి చెప్పిన ఒక కథను సల్మాన్ ఖాన్‌కు నచ్చి, ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Details

సల్మాన్ ఖాన్ తో చర్చలు

ప్రస్తుతం, ఇతర ఒప్పందాలు, మిగిలిన అంశాలపై దిల్ రాజు బృందంతో సల్మాన్ చర్చలు జరుపుతున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చర్చలు సఫలమైతే, త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కానుందని అంచనా వేస్తున్నారు. గతంలో తమిళ స్టార్ విజయ్‌తో 'వారిసు' (తెలుగులో 'వారసుడు') వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన వంశీ పైడిపల్లి, ఇప్పుడు సల్మాన్ ఖాన్ కోసం ఏ విధమైన కథ సిద్ధం చేశారో ప్రేక్షకుల కోసం ఆసక్తి సృష్టిస్తోంది.