Page Loader
Salman Khan: తన అనారోగ్యంపై మౌనం వీడిన సల్మాన్‌ ఖాన్‌.. ఏం చెప్పారంటే?
తన అనారోగ్యంపై మౌనం వీడిన సల్మాన్‌ ఖాన్‌.. ఏం చెప్పారంటే?

Salman Khan: తన అనారోగ్యంపై మౌనం వీడిన సల్మాన్‌ ఖాన్‌.. ఏం చెప్పారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

59 ఏళ్లకూ పెళ్లి చేసుకోకపోవడంపై బాలీవుడ్‌ అగ్ర నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) స్పందించారు. వివాహం, విడాకుల వ్యవహారాలు భావోద్వేగపరంగానూ, ఆర్థికంగానూ ఎంతో కఠినతరమని ఆయన పేర్కొన్నారు. ఇవి కొనసాగించడం అంత సులభం కాదని చెప్పారు. 'ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ శర్మ' షోలో పాల్గొన్న సల్మాన్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన ఆరోగ్య సమస్యలను తొలిసారిగా వెల్లడించిన సల్మాన్‌, 'ఏవీ మాల్ఫోర్మేషన్‌', 'బ్రెయిన్‌ ఎన్యోరిజమ్‌' వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు చెప్పారు.

Details

ఒక నటుడిగా రాణించడం అంత సులభం కాదు

'ఒక నటుడిగా రాణించడం అంత సులభం కాదు. యాక్షన్‌ సీక్వెన్స్‌లలో తరచూ గాయాలు అవుతుంటాయి. నాకు ట్రైజెమినల్‌ న్యూరల్జియా (ముఖ భాగంలో వచ్చే తీవ్రమైన నొప్పి), ఏవీ మాల్ఫోర్మేషన్‌ (రక్తనాళాల్లోని అసాధారణత), బ్రెయిన్‌ ఎన్యోరిజమ్‌ (మెదడులోని చిన్న సమస్య) ఉన్నప్పటికీ నేను పని కొనసాగిస్తున్నాను. ఎన్ని ఇబ్బందులున్నా, ప్రొఫెషనల్‌గా బ్రేక్‌ తీసుకోవాలనుకోవడం లేదు. చిన్నతనంలోనే ఇలాంటి సమస్యలు ఉంటే ఇప్పుడు వాటిని అధిగమించి ఉండేవాడిని. ఇప్పుడు ఈ సమస్యలను అధిగమించేందుకు నన్నే నేను రీస్టార్ట్‌ చేసుకుంటున్నానని సల్మాన్‌ తెలిపారు.

Details

అమిర్ ఖాన్ అద్భుతమైన వ్యక్తి

తన మిత్రుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) రిలేషన్‌షిప్‌ విషయంపైనా స్పందించారు. ''ఆయన అద్భుతమైన వ్యక్తి. పర్‌ఫెక్షనిస్ట్‌ అని ప్రపంచానికి తెలుసు. వివాహం విషయంలోనూ పర్‌ఫెక్షన్‌ వచ్చే వరకు ఆ బంధాన్ని కొనసాగిస్తారు. (గౌరీ స్ప్రాట్‌తో ఆమిర్‌ ప్రేమాయణాన్ని ఉద్దేశించి) నాకు తెలిసి ఇదే ఆయన చివరి లవ్‌స్టోరీ కావచ్చు. ఈసారి తప్పక రిలేషన్‌షిప్‌లో పర్‌ఫెక్షన్‌ సాధిస్తారు అనుకుంటానని నవ్వుతూ చెప్పారు. 'తేరీ నామ్‌' సినిమాలో తన లుక్‌ గురించి మాట్లాడుతూ, డాక్టర్‌ అబ్దుల్‌ కలాంనే స్ఫూర్తిగా తీసుకుని హెయిర్‌ స్టైల్‌ డిజైన్‌ చేయించుకున్నట్టు సల్మాన్‌ వెల్లడించారు.