LOADING...
Salman Khan: ఒంటరితనం పోస్ట్‌పై స్పందించిన సల్మాన్.. అసలు విషయం ఇదే!
ఒంటరితనం పోస్ట్‌పై స్పందించిన సల్మాన్.. అసలు విషయం ఇదే!

Salman Khan: ఒంటరితనం పోస్ట్‌పై స్పందించిన సల్మాన్.. అసలు విషయం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక షర్ట్‌లెస్ ఫొటో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. "నేను ఒంటరిగా ఉన్నాను" అన్న భావన వచ్చేలా కనిపించిన ఆ పోస్ట్, అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ మానసిక ఒత్తిడిలో ఉన్నారేమోనని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదం క్రమంగా పెరిగి, ఆయన నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్ వరకు చర్చకు దారితీయడంతో తాజాగా సల్మాన్ ఖాన్ స్వయంగా స్పందించి అసలు విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని సల్మాన్ తెలిపారు.

వివరాలు

మీ ప్రేమను తక్కువ చేసినట్లే

"నేను నా వ్యక్తిగత జీవితం గురించి ఆ పోస్ట్‌లో ఎక్కడా మాట్లాడలేదు. అంత పెద్ద కుటుంబం, కోట్లాది మంది అభిమానులు, స్నేహితులు ఉన్నప్పుడు నేను ఎలా ఒంటరిగా ఉంటాను? మీ అందరి ప్రేమాభిమానాలు ఎప్పుడూ నాతో ఉంటే నాకు ఒంటరితనం ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. అలాగే మీ అందరూ నాతో ఉన్నప్పటికీ నేను ఒంటరిగా ఉన్నానని అనుకుంటే, అది మీ ప్రేమను తక్కువ చేసినట్టే అవుతుంది. షూటింగ్స్ మధ్యలో నాకు కొంత వ్యక్తిగత సమయం కావాలని అనిపించింది. అందుకే ఆ పోస్ట్ పెట్టాను. కానీ దాన్ని మీరు భారీ వార్తగా మార్చేశారు. కనీసం నా ఫొటోను కూడా సరిగ్గా చూడకుండా బ్రేకింగ్ న్యూస్‌లు చేశారంటూ మీడియాపై స్వల్ప అసంతృప్తి వ్యక్తం చేశారు.

వివరాలు

ఆ వార్త చూసి అమ్మ కూడా కంగారుపడింది

ఇంకా ఆ వార్తల ప్రభావం తన కుటుంబంపైనా పడిందని సల్మాన్ వెల్లడించారు. "ఆ వార్తలు చూసి మా అమ్మ కూడా 'ఏమైంది నాన్న?' అంటూ ఆందోళనగా అడిగింది. అందుకే చెబుతున్నా.. రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్, నాకేం కాలేదని అభిమానులకు భరోసా ఇచ్చారు. సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఈ వివరణతో బాలీవుడ్ మీడియా వర్గాలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం తనకు కొంత 'మీ టైమ్' కావాలనే ఉద్దేశంతో చేసిన పోస్ట్‌ను మీడియా అతిగా ప్రచారం చేయడంపై సల్మాన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement