సమంత బర్త్ డే: తెలుగు సినిమా కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలు
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. కొద్ది మంది మాత్రమే ఎక్కువ కాలం హీరోయిన్లుగా కొనసాగుతారు. అలాంటి వారిలో సమంత ఒకరు.
ఇండస్ట్రీకి వచ్చి 13ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ స్టార్ గా కొనసాగుతోంది. ఈరోజు సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ పదమూడేళ్ళలో సమంత నటించిన సినిమాల్లోని కొన్ని గుర్తుండిపోయే పాత్రల గురించి మాట్లాడుకుందాం.
ఏ మాయ చేసావె (2010):
ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన సమంత, నిజంగా అందరినీ మాయ చేసేసింది. ఈ ప్రపంచంలో అందరూ ఉండగా నేను జెస్సీనే ఎందుకు ప్రేమించానని అందులో నాగ చైతన్య అనుకుంటుంటే, అదే మాటను బయట అభిమానులు అందరూ అనుకునేలా అందంగా కనిపించింది సమంత.
Details
రంగస్థలంతో శిఖరం ఎక్కిన సమంత
అ ఆ:
ఈ సినిమాలో, సమంత పాత్ర అందరికీ నచ్చింది. ఏమీ తెలియని అమాయకపు అమ్మాయిలా సమంత నటన, ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేసింది.
మనం:
ఈ సినిమాలో సమంత పాత్రకు ఫిదా కాని వారెవ్వరూ ఉండరు. రెండు విభిన్న షేడ్స్ లో కనిపించే ఆమె నటన, సినిమాకు హైలైట్ అయ్యింది.
రంగస్థలం:
సమంత ఎలాంటి పాత్రలనైనా అవలీలగా చేసేయగలదని రంగస్థలం నిరూపించింది. పల్లెటూరి అమ్మాయిగా సమంత పలికించిన హావాభావాలు, గడుసుదనం ప్రేక్షకలోకాన్ని అలరించాయి.
ఓ బేబీ:
రంగస్థలంతో శిఖరం ఎక్కిన సమంత, ఓ బేబీ సినిమాతో మరో మెట్టు చేరుకుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమ, బ్లాక్ బస్టర్ అయ్యింది.